Apr 05,2023 16:09
  • ఆకేపాటి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బాబు జగజ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అని జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం డిసిసి చైర్మన్ దండు గోపి, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు బొజ్జ పెంచలయ్యల ఆధ్వర్యంలో ఓసి క్లబ్ ప్రాంగణంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరచిపోలేనిదని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యక్షులు చొప్పా గంగిరెడ్డి, జెడ్పిటిసి పెంచలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి  రవి, మైనారిటీ నాయకులు అబ్దుల్ మున్నాఫ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.