బాధితులకు ఆర్థికసాయం
ప్రజాశక్తి-ఉదయగిరి : ఎసి కాలనీకి చెందిన చెలమచెర్ల కల్లయ్య, మరొక ఇద్దరి బాధ్యతలకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ ఆర్థికసాయం అందజేశారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని దుత్తలూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎసి కాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇల్లు సర్వం కోలిపోగా ఈ విషయం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ దృష్టికి గ్రామస్తులు తీసుకుపోగా ఈ సందర్భంగా ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి కల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.25వేలు తక్షణ నగదు సహాయం అందించారు. అలాగే గుండె జబ్బుతో మంచాన ఉన్న వేలూరు వెంగయ్య భార్య వెంకాయమ్మకు రూ.10 వేలు పసిబిడ్డ తల్లి భర్తతో విడిపోయి ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తున్న కోట నందినికి రూ.10 వేల తక్షణ ఆర్థికసాయం అందజేశారు. అనంతరం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరి హనుమంత నాయుడు, ఏలూరి అంజయ్య నాయుడు, అనంతయ్య నాయుడు, కూచి జయరామయ్య కత్తి సుధాకర్, చిన్న అంజయ్య, నూటేటి ఓబయ్య నాయుడు, ఇర్ల సుధాకర్, ఏలూరు తిరుపతయ్య, ఇర్ల తిరుపాల్, మాలకొండయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.










