Apr 09,2023 21:33

బండపల్లెలో ఇదేం ఖర్మ కార్యక్రమంలో రమేష్‌కుమార్‌రెడ్డి

రామాపురం : అవినీతి వైసిపి పాలనను అంతమొందించాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి పంచాయతీలోని వెంకటరెడ్డిగారిపల్లి, హరిజనవాడ, భైనేని హరిజనవాడ, చిట్లూరు పంచాయతీలోని చిట్లూరు కస్పా, మాలపల్లి, రాఘవరెడ్డిగారిపల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతి గ్రామంలో ప్రజలు మహిళలు పూల మాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలు గురించి ఆయన ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాని ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర వనరులు ఇసుక మాఫియా, భూకబ్జాలు వైసిపి నాయకులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు ఎం.రమేష్‌రెడ్డి, గాజులఖాదరబాషా, నరేంద్రకుమార్‌రెడ్డి, సురేంద్రరెడ్డి. రాంబసిరెడ్డి, వెంకట్రామిరెడ్డి. రామకష్ణ గౌడ్‌ పాల్గొన్నారు. వీరబల్లి : రాష్ట్రానికి పట్టిన శని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అని రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్‌ రాయుడు పేర్కొన్నారు. మట్టి ఎల్లంపల్లిలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్‌ పాలనలో దాచుకో..దోచుకో అనే సామెత లాగా ఉంది కానీ ఏమాత్రం అభివద్ధి చేసిన సంఘటన ఎక్కడ కనిపించలేదని అన్నారు. ఏ రంగంలో ముందుకు వెళ్లారో సిఎం జగన్‌ చెప్పాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో చాలా మంది నిధులు లేక ఖాళీగా ఉన్నారన్నారు. కేవలం బటన్‌ నొక్కుడు తప్ప ఏ గ్రామంలో కూడా కనుచూపుమేరకు అభివద్ధి చేసిన దాఖలాలే లేవన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలకు గతంలో రంజాన్‌ తోఫా ఇచ్చి పేద ముస్లింలు ఆదుకునే వారన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర సాధికార కమిటి కార్యదర్శి గుట్ట బాబు,, టిడిపి మండల శాఖ అధ్యక్షులు భానుగోపాల్‌ రాజు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ కొల్లి వెంకటరమణ నాయుడు, మాజీసర్పంచ్‌ రవినాయుడు, మండల ప్రధాన కార్యదర్శి రాయ వెంకటేష్‌ నాయుడు, అసెంబ్లీ వాణిజ్య విభాగ కార్యదర్శి పవన్‌, గుదే నాగార్జున నాయుడు, సురేష్‌ కుమార్‌, నాగార్జున నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు కాంతమ్మ పాల్గొన్నారు.