Apr 19,2023 20:55

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
అవినీతి ఆరోపణపై ధ్వజం
కోవూరు :మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో మట్టి, ఇసుకను, అక్రమంగా తరలిస్తున్నారంటూ టిడిపి నాయకుడు తిరుమూర్‌ అశోక్‌ రెడ్డి తమపై చేసిన అవినీతి ఆరోపణలపై వైసిపి మండల కన్వీనర్‌ నలుబోలు సుబ్బారెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన గ్రామంలోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి గ్రామంలో ఎవరు చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తిప్పను కొల్లగొట్టి గ్రావెల్‌ మట్టిని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. పెన్నా గర్భంలోని ఇసుకని కరకట్టలతో సహా మాయం చేసింది మీరే కదా అన్నారు. తమ రాజకీయ ఎదుగుదలను చూడాలేకే తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ బురద చల్లె ప్రయత్నం చేస్తున్నారన్నారు. గ్రామంలో ట్రాక్టర్లు జెసిబిలు వారి వద్ద డబ్బులు తీసుకొని తోలిస్తున్నానంటూ తనపై ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
అనంతరం సర్పంచి నలుబోలు వాణి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మీరు చేసిన అభివద్ధితో ప్రస్తుతం మా హాయంలో మేము చేస్తున్న అభివద్ధితో ప్రజలకు తెలుసు అన్నారు. తమరు చేసిన అవినీతి అక్రమాల కారణంగా ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మమ్మల్ని కానీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డిని గాని ప్రశ్నించే స్థాయి లేదన్నారు. మరోసారి ఇలా అవినీతి ఆరోపణలు చేస్తే చూస్తూ ఉండబోమని హెచ్చరించారు.కార్యక్రమంలో గంగవరం సర్పంచ్‌ లక్ష్మి, గంగవరం ఉపసర్పంచ్‌ మోషే, గాజులు మల్లికార్జున, అల్లం రాజా, మాచవరం పుల్లయ్య, ఉప సర్పంచ్‌ చల్ల వెంకటేశ్వర్లు, జాన వెంకటేశ్వర్లు గౌడ్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.