Sep 19,2023 22:48

బోల్తాపడిన ఆటో, బైకు, (ఇన్‌సెట్‌లో) మృతిచెందిన విద్యార్థి నవ్యశ్రీ

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : గుంటుపల్లి డాన్‌ బోస్కో స్కూల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదోతరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గుంటుపల్లివద్ద డాన్‌ బాస్కో స్కూల్‌ ఆటో బోల్తాతో 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. డాన్‌ బోస్కో స్కూల్‌ నుండి స్కూల్‌ విద్యార్థులను తీసుకువెళ్లే ఆటో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో డాన్‌ బాస్కో స్కూల్లో ఐదో తరగతి విద్యార్థి నవ్య శ్రీ మతి చెందింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన చిన్నారులను ఇబ్రహీంపట్నం పోలీసులు గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.