Mar 01,2023 22:41

ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎజిఎం సుబ్బారెడ్డి, సిఐ మధు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలు ఆడితేనే శరీర దృఢత్వంతో పాటు తెలివితేటలు పెరుగుతాయని ఎజిఎం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం కదిరి పట్టణంలోని చైతన్య పాఠశాలలో స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైతన్య పాఠశాల ఎజిఎం సుబ్బారెడ్డి, పట్టణ సిఐ మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో పాల్గొంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని శారీరక దృఢత్వం పొందుతారన్నారు. క్రీడల్లో ముందంజలో ఉన్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ హరిత , అనంతపురం బ్రాంచ్‌ ప్రిన్సిపల్‌ విశ్వనాథ్‌, ఏవో నాగరాజు, ప్రైమరీ జోనల్‌ ఇంచార్జ్‌ లలిత, డాన్‌ చిరంజీవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.