Apr 07,2023 21:38

అశ్వy ాహనంపై భక్తులను అను గ్రహించారు

  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్స వాల్లో ఎనిమిదో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వy ాహనంపై భక్తులను అను గ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమై 9 గంటలకు ముగి సింది. ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం కాళీయ మర్దనాల ంకారంలో రామ ులవారు ము గ్ధమనోహరంగా దర్శన మిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరి గింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలా హలంగా జరిగింది. యాత్రికులు అడు గడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు యాత్రికులకు దర్శన మిచ్చారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాం గణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనంజయ, విశేష సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.
రేపు చక్రస్నానం : శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శనివారం ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగ నుంది. రాత్రి 7 గంటలకు ధ్వజా వరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
9న పుష్పయాగం : శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో 10వ రోజు ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.