చెరువును పరిశీలిస్తున్న డీఎస్పీ
బుక్కపట్నం : అసాంఘిక కార్యకాలపలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక చెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువలలో పంట పొలాల్లో కంచెకు కరెంటు వదలడం చట్టారీత్యా నేరమన్నారు. అడవి జంతువుల కోసం కరెంటు వదిలి ప్రమాదాలు జరిగితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నరసింహుడు, ఎఎస్‌ఐ రమణ సిబ్బంది పాల్గొన్నారు.










