Apr 18,2023 21:44

ఫొటో : వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

ఆర్థిక తోడ్పాటుకు సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-మర్రిపాడు : సామాజిక, ఆర్థిక అసమానతులను తొలగించి ప్రతిఒక్కరికీ ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారని ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఇర్లపాడు గ్రామ సచివాలయం పరిధిలోని పెగళ్లపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మేకపాటి విక్రమ్‌ రెడ్డి నిర్వహించారు. ముందుగా ఎస్‌సి కాలనీలో వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఎంఎల్‌ఎ ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అన్ని అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే తెలియజేస్తే అధికారులతో చర్చించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకే వెళ్లి వారికి సంక్షేమ పథకాలను వివరించడమే కాక సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతులను తొలగించి ప్రతిఒక్కరికీ ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారని తెలిపారు. ఎస్‌సి కాలానీవాళ్లకు శ్మశానానికి దారి, పొలాల్లో వ్యవసాయ బోర్లకు కరెంట్‌ సౌకర్యం, హై లెవల్‌ కెనాల్‌లో ముంపునకు గురైన భూములకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఎస్‌సిలకు గ్రామానికి దగ్గరలో రెండు ఎకరాల్లో ఇళ్ల ఫ్లాట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని మరింత అభివృద్ధి చేసేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని, ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, సర్పంచ్‌ ప్రణవి, చెవులు శ్రీనివాసులు, బూదవాడ సర్పంచ్‌ హరిబాబు, నందవరం సర్పంచ్‌ రామ్మోహన్‌, వైసిపి నాయకులు ప్రతాప్‌ రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, కృష్ణప్రసాద్‌ రెడ్డి, మాజీ ఎంపిపి కోనంకి శ్రీనివాసులునాయుడు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.