ప్రజాశక్తి -గుడ్లూరు : మండలానికి చెందిన ఇద్దరు కార్యకర్తలు, ఇటీవల కందుకూరులో జరిగిన దుర్ఘటనలో గాయపడ్డారు. మండలం అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుండెమడుగుల ప్రకాశం కు కాలు విరగగా, గుడ్లూరు గ్రామానికి చెందిన కొమ్మి మాల్యాద్రి స్వల్పంగా గాయపడ్డారు. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛారిజ ఇంటూరి నాగేశ్వరరావు వారిద్దరిని ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. గాయాల నుంచి కోరుకునే వరకు ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, ఇతర నాయకులు వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. వైద్య ఖర్చులకోసం ప్రకాశంకు రూ. 30 వేలు, మాల్యాద్రికి 10వేలు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు పువ్వాడి శ్రీను, పార్టీ నాయకులు రావూరి వేణుగోపాల్, పువ్వాడి వేణుగోపాల్, మేకపోతుల రాఘ వయ్య, మండల తెలుగు యువత అధ్యక్షుడు చెన్నారెడ్డి మహేష్ పాల్గొన్నారు.










