ప్రజాశక్తి-కురబలకోట : మిట్స్ కళాశాలు బిటెక్ మూడవ సంవత్సరం ఇఇఇ చదువుతున్న విద్యార్ధులు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లా ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌ను ఆదివారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ ఆధ్వర్యంలో సందర్శించారు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో ఒకటని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిబాబు పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది, ఆర్‌టిపిపి వివరాలను వివరించారు. విద్యార్ధులు బాయిలర్, కూలింగ్ టవర్లు, టర్బైన్, జనరేటర్ గది పనితీరును చూసిన థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేషన్, నియంత్రణను నేర్చుకున్నారు. ఇఇ హరిబాబు పవర్ ప్లాంట్ ప్రక్రియను వివరించారు. విద్యార్థులను సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారు మొత్తం థర్మల్ పవర్ పిఎల్‌సి ఆధారిత నియంత్రణను చూశారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుళ్, విద్యార్థులు పాల్గొన్నారు.










