Oct 24,2023 22:20

ఆరోగ్యానికి, అధిక దిగుబడికి చిరు ధాన్యాలు

ఆరోగ్యానికి, అధిక దిగుబడికి చిరు ధాన్యాలు
ప్రజాశక్తి- వెంకటగిరి రూరల్‌ : ఆహారంలో భాగంగా చిరు ధాన్యాలను తీసుకోవాలని వీటి వల్ల ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్‌ వైయస్సార్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం సంచాలకులు డాక్టర్‌ కర్ణశ్రీ అన్నారు. పెరియావరంలోని కషి విజ్ఞాన కేంద్రంలో చిరు ధాన్యాల క్షేత్ర ప్రదర్శనశాలకు విశిష్ట అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ రైతుల ప్రదర్శనలో సమావేశానికి అధ్యక్షులు డాక్టర్‌ గోవిందరాజులు ఆధ్వర్యంలో సిరి ధాన్యాల క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు ధాన్యాలను ప్రతి రైతు పండించాలని కోరారు. అనంతరం ఏడిఏ వ్యవసాయ ఉప సంచాలకులు నాగార్జునసాగర్‌ మాట్లాడుతూ మెట్టు ప్రాంత రైతులు వర్ష పాతం తక్కువగా ఉన్నా చిరు ధాన్యాల పంటను వేసుకోవచ్చని తద్వారా అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ తిరుపాల్‌, డాక్టర్‌ నాగార్జున రెడ్డి, రాజీవన పాల్గొన్నారు.