Mar 05,2023 22:17

సైకిల్‌ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, తదితరులు

పుట్టపర్తి రూరల్‌: ప్రతి ఒక్కరూ ఆరోగ్యసూత్రాలు పాటించాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైకిల్‌ ర్యాలీని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, జిల్లా వైద్యాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం ఉదయం గణేష్‌ సర్కిల్‌ వద్ద కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ర్యాలీని ప్రారంభించారు. ఆరోగ్య మహిళ, ఆరోగ్య ఇండియా, సైకిల్‌ తొ¸క్కండి ఆరోగ్యంగా ఉండండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ,అనే నినాదంతో మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్‌ ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పుట్టపర్తి, యనమలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, బ్రహ్మకుమారీలు, గణేష్‌ సర్కిల్‌ నుండి సత్యమ్మ గుడి వరకు సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా యూనిట్‌ అధికారి కుల్లాయప్ప నాయక్‌, సిహెచ్‌ఒ నగేష్‌, సూపర్‌వైజర్లు లింగా రామ్మోహన్‌, లక్ష్మానాయక్‌, రమణయ్య, చంద్రకళ, నాగరత్నమ్మ, రెడ్‌ క్రాస్‌ మెంబర్లు రాజా, గోపీ, రమణ డాక్టర్‌ గోపాల్‌ రెడ్డి, మోహన్‌ రెడ్డి, చంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు