ఆరోగ్య కేంద్రంలో అకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని గండిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అదనపు వైద్యాధికారి జిల్లా క్షయ లెప్రసీ ఎయిడ్స్ నివారణ ఆత్మకూరు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి వెంకట ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న అద్దె భవనానికి సరైన వసతులు లేవని మరమ్మతులు చేయబడిన గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడి నుంచి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. వైద్యశాలలోని వసతులను పరిశీలించిన ఆయన రోగులకు అరుదైన వసతులు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అణువుగా ఉందని తెలిపారు. కనుక వెంటనే అద్దె భవనం నుంచి పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనంలోకి మార్చాలని తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులు శివకల్పన, వినీత, సి హెచ్ ఒ శివకుమారి, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.










