డెంకాడ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని చింతలవలస-2లో సచివాలయ భవన నిర్మాణానికి మంగళ వారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలోనే పూర్తి చేశారన్నారు. 2014లో చంద్రబాబు600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, తహశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎంపిడిఒ జిడి స్వరూపరాణి, మాజీ సర్పంచి పిన్నింటి తమ్మునాయుడు, జొన్నాడ సొసైటీ చైర్మన్ పిన్నింటి సత్యారావు, వైసిపి మండలశాఖ అధ్యక్షులు బంటుపల్లి వాసుదేవరావు పాల్గొన్నారు.
ఏడాదిలోని హామీలన్నీ అమలు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలంటినీ ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని ఎంపి బెల్లాన, ఎమ్మెల్యే బడ్డుకొండ అన్నారు. ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు పేరిట మండలంలోని బొడ్డవలసలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర బొడ్డవలస నుంచి జొన్నాడ, మోపాడ, జగన్నాధపురం, కొండరాజుపేట వరకు నిర్వహించారు. అనంతరం కొండరాజుపేటలో మాట్లాడుతూ దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ వాటిని అధిగమించి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి సురేష్‌బాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల వైసిపి కన్వీనర్లు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, బంటుపల్లి వాసుదేవరావు, పోలిపల్లి, డెంకాడ, జొన్నాడ సొసైటీల చైర్మన్లు కంది సూర్యనారాయణ, రొంగళి కనక సింహాచలం, పిన్నింటి తమ్మునాయుడు, నాయకులు, కె.కోటినాయుడు, సువ్వాడ రమేష్, అట్టాడ ముసలినాయుడు, బడ్డుకొండ రమేష్‌నాయుడు, సరగడ బంగారురెడ్డి, ఈశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.










