ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ :జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని జిల్లా అబ్జర్వర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఓటర్ల జాబితా సవరణ 2023 అంశం పై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బసంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఇన్‌ఛాఇర్జ డిఆర్‌ఒ భాగ్యరేఖ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సూచనలు సలహాలు తీసుకొని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని పరిశీలకులు తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, వైసిపి ప్రతినిధి తిప్పన్న, జనసేన బొగ్గరం శ్రీనివాసులు, టిడిపి విజరు కుమార్, బిజెపి భాస్కర్ నాయక్, కదిరి ఆర్డీవో రాఘవేంద్ర, ధర్మవరం ఆర్డీవో తిప్పేనాయక్, ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.










