అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 88,149 నమూనాలను పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 481 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 336, పశ్చిమ గోదావరి జిల్లాలో 326, కృష్ణా జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 245 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,201 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి నేటివరకు 13,178 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,44,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 19,07,201 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,843 మంది చికిత్స పొందుతున్నారు.










