Apr 10,2023 20:56

ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడు

మదనపల్లె అర్బన్‌ : అప్పులబాధ తాళలేక చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ములకలచెరువు మండలం, బలకవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు బి.ఎన్‌.ఆనందరెడ్డి(37) జీవనఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం మదనపల్లిలోని అయోధ్య నగరంలో ఉంటూ కూలి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలకు రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని నుండి ఇంటికి వచ్చిన భార్య సుభాషిని ఇంటి తలుపులు వేసి ఉండడం, ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించి పోలీసుల సమక్షంలో తలుపులు తెరిచిచూడగా ఉరికి వేలాడుతూ కనిపించడంతో మృతదేహాన్ని కిందకి దింపి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.