Jul 20,2021 13:49

న్యూఢిల్లీ : రాజ్యసభలో కరోనాపై చర్చను వైసిపి ఎంపిలు అడ్డుకున్నారు. ఎపి ప్రత్యేక హోదా కోసం ఎంపిలు ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనలతో స్పీకర్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణను ఉపసంహరించుకోవాలని, 'విశాఖ స్టీల్‌ ప్లాంట్‌-నాట్‌ ఫర్‌ సేల్‌ ' అనే ప్లకార్డులతో నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఏడాది వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, సవరణ అంచనాల ఆమోదంలో జాప్యం చేయవద్దని అన్నారు. దశలవారీగా ఆర్‌అండ్‌ఆర్‌ నిధులను విడుదల చేయాలని కోరారు.. అయితే ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే అడ్డుకోవడం సరికాదని, కరోనా అందరినీ ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పీయూష్‌గోయల్‌ అన్నారు.