Jul 20,2021 19:49

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వీస్తాయని తెలిపారు.