Jul 20,2021 16:22

అమరావతి : సంచార జాతులకు ప్రాధాన్యతనిచ్చిన నాయకుడు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సిఎం జగన్‌ అమలు చేస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో ఇన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సిఎం చెప్పినట్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.