Sep 09,2023 22:44

వన్‌టౌన్‌లో...


వీరులపాడు : తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ జయంతిలో, జగన్నాధపురం, అన్నవరంగూడెం, మాధవపొన్నారం గోకరాజుపల్లి, తదితర గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు చిదిరాల భారత రెడ్డి గువ్వల సత్యన్నారాయణ వీరులపాడు పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. రెడ్డిగూడెం : టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మెయిన్‌ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. టిడిపి యువ నాయకుడు బొమ్మిన కోటేశ్వరరావు దీక్షకు దిగారు. గంపలగూడెం : తోట మూల నుండి గాంధీ సెంటర్‌ వరకు వివిధ గ్రామాల పార్టీ నాయకులు సమిష్టిగా నిరసన తెలిపారు. ఆయా వ్యాపార దుకాణాలను మూయించారు. మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, తదితరులు అరెస్టు చేశారు. మైలవరం : మైలవరంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద రహదారిపై తెదేపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఆగిపోవడంతో ఎస్‌ఐ హరి ప్రసాద్‌ సంఘాల స్థలం చేరుకున్నారు. తెదేపా నాయకులను బలవంతంగా స్టేషన్‌ తరలించే ప్రయత్నంలో తెదేపా నాయకులకు పోలీసులకు తోపు లాటజరిగింది. పోలీస్‌ వాహనంలో పలువురు తెదేపా నాయకులు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. నందిగామ : మునగచర్ల, అంబారుపేట క్రాస్‌ రోడ్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో లు చేశారు. రాస్తారోకో, ధర్నాలతో భారీగా వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారి పై కిలోమీటర్ల దూరం ట్రాఫిక్‌ నిలిచి పోయింది. రహదారిపై ధర్నా చేస్తున్న టిడిపి నాయకులకు టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఎమ్మెస్‌ రాజు సంఘీభావం తెలియజేశారు. ధర్నాలో పాల్గొన్న టిడిపి నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నందిగామ మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య ఖండిస్తూ బ్లాక్‌ డే ప్రకటించారు. ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య, టిడిపి నాయకులను గహనిర్బంధం చేశారు. అనంతరం సౌమ్యను అరెస్టు చేసి వీరులపాడు స్టేషన్‌ కు తరలించారు. సౌమ్య ఇంటి వద్దకు భారీగా చేరుకున్న టిడిపి నాయకులు అనంతరం మునగచర్ల, అంబారుపేట క్రాస్‌ రోడ్‌ వద్ద జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై ధర్నా చేస్తున్న టిడిపి నాయకులకు టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఎమ్మెస్‌ రాజు సంఘీభావం తెలియజేశారు. రామిరెడ్డిపల్లిలో రహదారిపై నందిగామ మండల టిడిపి నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధ కల్పించాలని 8వ తేదీ నుంచి 22 వరకు నిరాహార దీక్షలను మందకష్ణ మాదిగ ఆదేశాల ఆదేశాల మేరకు శనివారం నందిగామ గాంధీ సెంటర్‌ ప్రధాన కూడలి వద్ద ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి ఆధ్వర్యంలో నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం : మండలంలోని ప్రధాన ప్రాంతాల వద్ద గస్తీ పెట్టారు. ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. కొండపల్లి నాలుగు వంతెనల సెంటర్‌ లో సిఎం జగన్మోహన్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడ నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ బి కాలనీ దగ్గరకు రాగానే ఇబ్రహీంపట్నం సీఐ శ్రీను తన బృందంతో అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తరలించిన అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో సిఎం జగన్‌ చిత్ర పటాన్ని టిడిపి నాయకులు దహనం చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, టిడిపి నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి దర్శనపు స్వతంత్ర కుమార్‌ ప్రకటనలో ఖండించారు. మండల టిడిపి నాయకులు, కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. తిరువూరు : టిడిపి నియోజవర్గ ఇన్‌ ఛార్జ్‌ శావాల దేవదత్తును పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేందుకు బైపాస్‌ రోడ్డులో ఉన్న దత్తును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దత్తుకు, పోలీసులకు మధ్య వా గ్వివాదం జరిగింది. ఈ క్రమంలో దత్తు కిందపడ్డారు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించారు జగ్గయ్యపేట : పట్టణంలో టిడిపి ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు రఘురాం, మాజీ శాసనసభ్యులు శ్రీరామ్‌ రాజగోపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జగ్గయ్యపేట సిఐ జానకిరామ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సిఐ కార్యాలయానికి రఘురాం, రాజగోపాల్‌ను తరలించారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో, టైర్లు కాల్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిల్లకల్లు పోలీసులు సంఘటపా స్థలం వద్దకు విచ్చేసి నిరసనకారులను చెదరగొట్టి కాలిన టైర్లను తీసివేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించారు. గ్రామాల్లో నిరసన, సిఎం జగన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చంద్రబాబు అరెస్టును జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం ఖండించారు. వీరులపాడు : మండలం పోలీస్‌ స్టేషన్‌ వద్ద నాయకురాలు తంగిరాల సౌమ్యను చూపించాలంటూ టిడిపి నాయకులు ఆందోళన చేశారు. విజయవాడ అర్బన్‌ : పటమట అశోక్‌నగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ గద్దె అనూరాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌నగర్‌ పార్టీ కార్యాలయం వద్ద నుండి ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్దకు శాంతియుతంగా ర్యాలీగా నాయకులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, ముమ్మనేని ప్రసాద్‌, చెన్నుపాటి ఉషారాణి, చెన్నుపాటి కాంత్రిశ్రీ, చెన్నుపాటి గాంధీ, పాల్గొన్నారు. 3వ డివిజన్‌లోని పలు కాలనీలలో మహిళలు పెద్ద ఎత్తున నల్ల జెండాలు పట్టుకుని, నినాదాలు చేశారు. స్తూ చంద్రబాబుకు సంఘీబావం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పేరేపి ఈశ్వర్‌, పలువురు నేతలు పాల్గొన్నారు. వన్‌టౌన్‌ : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు విజయవాడ నగర వ్యాప్తంగా వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియచేశారు. ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్టు చేయగా, మరి కొందరు నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, 52వ డివిజన్‌ తెలుగుదేశం కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి)లను అరెస్టుచేసి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే విద్యాధరపురంలో టిడిపి నాయకులు వర్ల రామయ్యను హౌస్‌ అరెస్టు చేసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటివద్ద తెలుగుదేశం నాయకులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులను భవానీపురం, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పశ్చిమ టిడిపి నాయకులు ఎంఎస్‌.బేగ్‌, సారిపల్లి రాధాకృష్ణ, ఆర్‌.మాధవ తదితరులు వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. కొన్నిచోట్ల తెలుగుదేశం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. బుద్ధా వెంకన్న కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడు కొండలు, కాండ్రేగుల రవీంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు శనివారం నిరసన తెలియచేశారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 52వ డివిజన్‌ టిడిపి కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) తలకిందులుగా శీర్షాసనం వేసి నిరసన తెలియజేశారు. విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) సూచనల మేరకు శనివారం43వ డివిజన్‌ టిడిపి అధ్యక్షులు దూది బ్రహ్మయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు జనసేన నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ తీవ్రంగా ఖండించారు. వత్సవాయి : తెలుగుదేశం నాయకుల ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు. జి కొండూరు : అర్ధరాత్రి వేలాదిమంది పోలీసుల ఆధ్వర్యంలో చంద్రబాబును అరెస్టు చేయడం అత్యంత దారుణమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి జువ్వ రాంబాబు తెలిపారు. విజయవాడ పార్లమెంట్‌ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గుడిపూడి శివశంకర్‌, టీఎన్టియుసి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బూర్సు శివ, ఎస్సీ సెల్‌ పచ్చిగొల్ల బాలకష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని దీన్ని ఖండించారు.
పెనుగంచిప్రోలు : 65వ జాతీయ రహదారి కొణకంచి అడ్డరోడ్డు వద్ద టిడిపి నాయకులు కాసేపు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని దేశం పార్టీ నాయకులను స్ధానిక పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు స్టేషన్‌లోనే వుంచారు. కొంతమందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.