అంగన్‌వాడీలకు రూ.26వేలు ఇవ్వాలి
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనంగా రూ.26వేలు వేతనం కల్పించాలని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎఎస్‌పేటలో సిఐటియు మండల కార్యదర్శి ఘయాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు నాయకురాలు రూత్‌అమ్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఎస్‌పేటలో ఆటో డ్రైవర్లకు ఆటోస్టాండు లేనందున ఎక్కడ ఆపాలో తెలియడం లేదన్నారు. అంగన్‌వాడీలకు పనిభారం పెరిగిందన్నారు. నెలనెలా జీతాలు ప్రభుత్వం నుండి రావడం లేదని, దాంతో ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రాల బాడుగులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆమె తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.26వేల జీతం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. రానున్న ఎంఎల్‌సి ఎన్నికల గురించి సమావేశంలో చర్చించారు. అనంతరం ఎఎస్‌పేట ఆటో యూనియన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు గౌష్‌బాషా, ఆటో యూనియన్ నాయకులు షేక్ ఇస్మాయిల్, జిల్లా నాయకులు శివన్న, అంగన్‌వాడీ నాయకురాలు రుత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.










