కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉన్నం భాస్కరరావు
ప్రజాశక్తి -కందుకూరు :స్థానిక ఆక్సఫర్డ్ ఒలంపియాడ్ స్కూల్‌లో బుధవారం 9వ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు పాఠశాలలోనే మొదలవుతుందన్నారు. వారి ఉన్నత భవిష్యత్తు కోసం తమ పాఠశాల తరపు నుంచి తాము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, పాఠశాల డైరెక్టర్ బి బాలభాస్కర్, కాలేజీ డైరెక్టర్ బి నరేంద్ర, ప్రిన్సిపాల్స్ ఎం రామారావు, పి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.










