వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి -పెనుకొండ : పట్టణంలో అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌కు సిపిఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో అనేక చోట్ల అక్రమ కట్టడాలు చేపడుతున్నారన్నారు. పురాతన బావులు పూడ్చి డ్రైనేజ్ పైన ప్రహరీలు నిర్మిస్తున్న వరిపైయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్, తిప్పన్న, సిఐటియ మండల కార్యదర్శి బాబావలి, నాయకులు వజ్రం నాగప్ప , మహబూబ్ బాషా, రెడ్డప్పరెడ్డి, మూర్తి, మహేష్ తదితరులు పాల్గొన్నారు .










