మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి -కందుకూరు స్థానిక టిడిపి కార్యాలయంలో ఐటిడిపి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. నెల్లూరు పార్లమెంట్ ఆర్‌టిసి ట్రైనర్ గొట్టిపాటి మనోరమ, పార్లమెంట్ ఐటిడిపి కోఆర్డినేటర్ షేక్ రసూల్, హౌస్ మ్యాపింగ్ కోఆర్డినేటర్ కార్తీక్, కందుకూరు పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండలపార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహం తదితరులు హాజరయ్యారు. ఆర్‌టిసి మన టిడిపి యాప్‌ల నిర్వహణ, హౌస్ మ్యాపింగ్ అంశాలపై ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఇంచార్జ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా యాప్‌లను వినియోగించుకోవాలన్నారు.










