Jul 12,2021 15:28

అంతరిక్షంలో వ్యోమగాములు ఏం చేస్తారు, ఎలా పని చేస్తారు అనే విషయం ఎప్పుడూ ఆసక్తికరమే. స్పేస్‌వాక్‌ అని అంటుంటారు కదా... అదేంటి? ఎలా చేస్తారు? ఈ ప్రశ్న ఎప్పటి నుంచో చాలామందికి ఉండి ఉంటుంది. అలాంటివారు చాలా మందే ఉన్నారా? అయితే అలాంటి వారి కోసమే నాసా తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఐఎస్‌ఎస్‌కు నాసా చేసిన మార్పుల్లో భాగంగా ఆరు సోలార్‌ అరేలను అమర్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇందులో మనకు వచ్చిన సందేహాలు, అసలు వ్యోమగాములు ఎలా పని చేస్తారు అనే విషయాలు తెలుస్తాయి.

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌) లో ఇటీవల నాసా బృందం కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇటీవల నాసా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఎ) కి చెందిన ఫ్రాన్స్‌ వ్యోమగామి థామస్‌ పెస్‌క్వెట్‌, నాసాకు చెందిన షేన్‌ కిమ్‌బ్రో కలసి ఐఎస్‌ఎస్‌లో సోలార్‌ అరేను ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ ఇద్దరూ కలసి ఐఎస్‌ఎస్‌కు పవర్‌ సప్లరును అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ సమయంలో వారిద్దరూ భూమికి 410 కిలోమీటర్ల దూరంలో బ్లూప్లానెట్‌ కక్ష్యలో ఉన్నారు.
     ఐఎస్‌ఎస్‌కు ఆరు సోలార్‌ అరేల (ఐఆర్‌వోఎస్‌ఏ) ను ఏర్పాటు చేయాలని ఈ స్పేస్‌వాక్‌ను నిర్వహిస్తున్నారు. దీనికోసం ఇటీవల స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ కార్గో షిప్‌లో కావాల్సిన సామాగ్రిని పంపించారు. ఈ వారం మొదట్లో ఒక ఐఆర్‌వోఎస్‌ఏను ఏర్పాటు చేశారు వ్యోమగాములు. ఇక సోలార్‌ అరేలను గురించి చూస్తే.. ఐఎస్‌ఎస్‌ పని చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. సూర్యుడి నుంచి శక్తిని సంగ్రహించడానికి ఐఎస్‌ఎస్‌లో నాలుగు జతల సోలార్‌ అరేలు ఉంటాయి. అలా వచ్చిన విద్యుత్తు శక్తితో ఐఎస్‌ఎస్‌లో వివిధ సైన్స్‌ పరిశోధనలు నిర్వహిస్తుంటారు. దాంతోపాటు నిర్దేశిత కక్ష్యలో అంతరిక్ష కేంద్రం తిరగడానికి కూడా ఆ శక్తే పనికొస్తుంది.
     ప్రస్తుతం ఈ స్పేస్‌ స్టేషన్‌ చంద్రుడి మిషన్‌లో ఉంది. డీప్‌ స్పేస్‌, మార్స్‌ కోసం సిద్ధం చేస్తున్న ఫ్యూచర్‌ మిషన్స్‌ గురించి ఈ స్పేస్‌స్టేషన్‌ను వాడుతున్నారు. ఈ క్రమంలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని పరీక్షించడానికీ ఈ స్పేస్‌స్టేషన్‌ నిర్వహిస్తున్నట్లు నాసా తెలిపింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న ఎనిమిది అరేల ద్వారా రోజుకు 160 కిలోవాట్‌ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అలా ఉత్పత్తి అయిన విద్యుత్తును బ్యాటరీల్లో భద్రపరుస్తుంటారు. స్పేస్‌ స్టేషన్‌కు సూర్యరశ్మి అందుబాటులో లేనప్పుడు ఆ విద్యుత్తును వాడుకుంటూ ఉంటారు. ముందుగా చెప్పుకున్నట్లు ఒక్కో అరే 20 కిలోవాట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రోజుకు ఆర్బిట్‌ డే టైమ్‌లో 120 కిలోవాట్‌ విద్యుదుత్పత్తి అవుతుంది. ఇవి కాకుండా మిగిలిన అరేలు 95 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అలా మొత్తం 215 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నమాట.

 

ఐఎస్‌ఎస్‌కుఆరు సోలార్‌ అరేలు..!ఐఎస్‌ఎస్‌కుఆరు సోలార్‌ అరేలు..!