అగ్ని ప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అగ్నిప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు వంటశాలలో గ్యాస్ వాడుతునప్పుడు తగు జాగ్రత్తలను తీసుకోవాలని వివరించారు. గ్యాస్‌లో మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రాక్టికల్‌గా మంటలను ఎలా అదుపు చేయాలో మహిళలచే చేయించారు. అగ్ని ప్రమాదాలలో చిక్కుకున్న వారిని, గాయపడిన వారిని ఎలా రక్షించాలో వివరించారు. పడవల్లో ప్రయాణించేటప్పుడు లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి బి.పెంచలయ్య, ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, సరోజ, సహోపాధ్యాయులు, విద్యార్థులు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.










