ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు ఆగడం లేదు...చివరకు మున్సిపల్ ఆస్తులను సైతం కౌన్సిల్ సమావేశంలో ఆమోదం చేసి దారదత్తం చేస్తున్నారు. దీంతో పురపాలికకు భారీగా ఆదాయం గండి పడుతున్నది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన వార్డు ప్లానింగ్ సెక్రేటరీలు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు, కొంత వార్డు ప్రజాప్రతినిధులకు కలెక్షన్ ఏజెంట్లు మారినట్లు వార్తులు వినపిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రణాళిక విభాగం పేరుకే ఉన్నట్లు విమర్శలు వినపిస్తున్నాయి.
హిందూపురం పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక విభాగం పేరుకే అన్నట్లు మిగిలి పోతోంది. ఇక్కడ ఎవరూ పనిచేసేవారు లేరు. వచ్చిన వారంతా కేవలం దండుకోవడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. అదికారులు పూరి స్తాయిలో సిబ్బందిని నియమించక పోవడం, దీన్ని అవకాశంగా తీసుకొని సొంత బొక్కసాలు నింపుకోవడం నిత్యకృత్యంగా మారింది. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే ప్లానింగ్ సెక్రేటరీలు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తే పురపాలక సంఘం వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలతో పాటు మున్సిపల్ రిజర్వు స్థలాలను పరీరక్షణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కొంత మంది ప్లానింగ్ సెక్రేటరీలు అక్రమ నిర్మాణాలు గుర్తించినప్పటికి చర్యలు తీసుకోవడం లేదు. కేవలం అక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించడం, వారికి నోటీసులు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం పరిపాటిగాఆ మారింది. దోచుకున్నోడికి దోచుకున్నంత' అన్న చందంగా ఉంది. హిందూపురం పురపాలక సంఘంలో కొంత మంది సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అనుమతుల మాటున అడ్డగోలు నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక భవన నిర్మాణానికి ప్లాన్ పొందాలంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.60 వేలు చలానా చెల్లించాలి. కానీ అక్రమార్కులు టౌన్‌ప్లానింగ్ విభాగంలో కొంతమందికి మామూళ్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అనుమతులు లేకుండానే అవినీతి పునాదులపై అంతస్తులు నిర్మిస్తున్నారు. పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీనికి అధికార పార్టీకి చెందిన కొంత మంది కౌన్సిలర్లు సహకరిస్తున్నట్లు సమాచారం. అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత ప్లాన్ అప్రూవ్ కాకుండానే భవన నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కొందరు కనీసం అనుమతి కోసం దరఖాస్తు చేయకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు.
తెర వెనుక నాయకులు...
హిందూపురం పురపాలక సంఘంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అక్రమ కట్టడాల వెనుక అధికార పార్టీకి చెందిన కొంత మంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల హస్తం ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారిలో కొంత మంది పాలకులను ప్రసన్నం చేసుకుంటే మున్సిపల్ రిజర్వు స్థలంలో అయిన నిర్మాణాలు చేసుకోవాడానికి అనుమతులు లభిస్తున్నాయి. దీనికి నిదర్శనం సిండికేట్ ఫార్మ సోసైటికి చెందిన స్థలంలో హల్‌సేల్ మార్కెట్ నిర్వహణకు అనుమతులు, పాత బస్టాండ్, ఇందిరా పార్కులో ఉన్నా సామూహిక మరుగుదొడ్లకు ఇచ్చిన అనుమతులే నిదర్శనం.










