ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : ఆధునిక వైద్య చికిత్సలను అన్ని వర్గాల వారికి అందుబాటులో తేవాలని, కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు సేవా దక్పథంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మొగల్రాజపురం చండ్ర రాజేశ్వరరావు వీధిలోని విధాత హాస్పిటల్‌ను ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్‌లో అంబాటులో ఉన్న వైద్య విభాగాలు, సాంకేతిక వసతులను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కార్పొరేట్ ఆసుపత్రులు భాగస్వాములవ్వాలని, పేదలకు సైతం అత్యున్నత శ్రేణి వైద్య చికిత్సలు అందుబాటులో ఉండేలా కషి చేయాలని గవర్నర్ సూచించారు. అనంతరం, విధాత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రఖ్యాత సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, సేవా దక్పథంతో విశిష్ట వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో విధాత హాస్పిటల్ రూపుదిద్దుకుందని అన్నారు. విశేష అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ప్రపంచ శ్రేణి సాంకేతిక వసతులతో ప్రజలకు ప్రాణదాతగా విధాత నిలుస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందరికీ అందరికీ అందుబాటులో ఉంచేలా కషి చేస్తామని అన్నారు. లాభాపేక్ష లేకుండా, పూర్తి మానవతా దక్పథంతో, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని తెలియజేశారు. తమ హాస్పిటల్‌లో గ్యాస్ట్రో, లివర్, ప్యాంక్రియాస్ అడ్వాన్స్డ్ లాపరోస్క్రోపిక్, బేరియాట్రిక్ సర్జరీలు, జనరల్ మెడిసిన్, అన్ని రకముల జ్వరాలు, షుగర్, బీపీ, పాముకాటు, పాయిజనింగ్ కేసులు, ఆస్తమా, టీబీ, ఊపిరితుత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అత్యాధునిక గైనకాలజి ఆపరేషన్లు, లాపరోస్ట్రోపిక్, ట్యూబల్ రీకనలైజేషన్, యాక్సిడెంట్, ట్రామా, ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, మూత్రపిండాల వ్యాధులకు ఆపరేషన్లు, కిడ్నీ స్టోన్స్, సర్జరీలు, అన్ని రకముల యూరాలజి వైద్య సేవలు, న్యూరో, న్యూరో సర్జరీ వైద్య సేవలు, ఎమర్జన్సీ సేవల కోసం ఎనస్తీషియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ల పర్యవేక్షణలో 24 గంటల ఐసీయు, ఎండోస్కోపి, కొలనోస్కోపి, బ్రాంకోస్కోపి, ఈఆర్సీపీ స్లీప్ స్టడీ, పల్మనరి ఫంక్షన్ టెస్టులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని విశ్వసిస్తూ, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, డాక్టర్ కొడాలి వెంకట ఉమాకాంత్, డాక్టర్ కె. యుగంధర్, డాక్టర్ ఎల్. పద్మజ, డాక్టర్ బిఎస్వీవీ రత్నగిరి, డాక్టర్ ఎం. రవిచంద్ర పాల్గొన్నారు.










