Dec 27,2022 18:35

దుకాణంలో పరిశీలిస్తున్న గీతాకుమారి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి గీతాకుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె మండలంలోని నరుకూరలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మార్పి కి మించి ఎరువులు, పురుగుమందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. గీతాకుమారి నరుకురులోని శ్రీ కళ్యాణి ఫర్టిలైజర్స్‌, శ్రీ సాయిరాం ఎంటర్ప్రైజెస్‌, సాయిబాబా ఫర్టిలైజర్స్ను తనిఖీ చేశారు. దుకాణాలలో ఎరువుల నిల్వలు, అమ్మకాలు, స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు.