Feb 24,2023 21:58

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న డిఎల్‌డిఒ గంగ భవాని

ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలి
ప్రజాశక్తి-బిట్రగుంట  : ప్రతి ఒక్కరికీ ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని డిఎల్‌డిఒ గంగ భవాని పేర్కొన్నారు. మండలంలోని మేజర్‌ పంచాయతీలు బోగోలు బిట్‌-1, బిట్‌-2, విశ్వనాధరావుపేట బిట్‌-1 సచివాలయాలను శుక్రవారం డిఎల్‌డిఒ గంగభవాని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు, ఆధార్‌ కార్డు పొందని వారికి అవగాహన కలిగించి తప్పనిసరిగా వారికి ఆధార్‌ కార్డు ఇప్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గోవిందరాజు, శ్రీదేవి, విశ్వనాధరావుపేట వైసిపి నాయకులు గండూరి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.