ప్రజాశక్తి-కనిగిరి : ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏసీబీ వలలో మరో అవినీతి సర్వేయర్ చిక్కాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా కనిగిరి మండల సర్వేయర్ అల్లం రంగస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వంగపాడుకు చెందిన రైతు కాకర్ల వెంకటేశ్వర్లు నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సర్వేర్లు పట్టుకున్నారు. తహసిల్దార్ కార్యాలయంలో సర్వేయర్ రంగస్వామిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.










