మదనపల్లె అర్బన్ : రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా మదనపల్లి నియోజకవర్గ అభివద్ధి కోసం ఏం చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలని, అభివృద్దిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతం కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారంలో రెండు పర్యాయాలు మదనపల్లిలో పర్యటించిన ఎంపీ కుల రాజకీయాలకు తెరలేపి అభివద్ధిని పక్కనపెట్టి కాపులను ఓటర్లుగా పరిమితం చేసి శ్రీకష్ణదేవరాయల విగ్రహం పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలియజేశారు. బిఎస్‌పి వ్యవస్థాపకులు కాన్షీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాపులను ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పిన మాటలు గుర్తు చేశారు. వాల్మీకుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 50 లక్షలు మంజూరు చేస్తామని చెప్పి శిలాఫలకం వేసిన ఎంపీ మిధున్ రెడ్డి వాల్మీకుల అభివద్ధి కోసం రూ. 50 కోట్లు మంజూరు చేసి సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. వాల్మీ కులను రాజకీయంగా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో కాపులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా కేవలం కాపులను ఓటర్లుగా పరిమితం చేసి ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో మదనపల్లె నియోజకవర్గంలో రైల్వేజోన్ కానీ , హంద్రీనీవా కాలువ కోసం ఏమాత్రం ప్రయత్నించలేదని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాజ్యాధికారంలో భాగస్వామి చేసే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని తెలియచేశారు. కార్యక్ర మంలో బిఎస్‌పి నాయకులు రమణ బాలాజీ అరుణ్,శివ ,శ్రీనాథ్, అనిల్ , గంగాధర ,శ్రీనివాసులు, మహేష్, లక్ష్మీపతి ,పెద్దోడు, రెడ్డి మోహన్, ప్రసాద్, సోమశేఖర్ ,ప్రకాష్ ,గంగ రాజు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న బిఎస్‌పి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతంకుమార్










