Nov 12,2023 00:21

నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురష్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శనివారం జాతీయ విద్యా దినోత్సవం, అల్ప సంఖ్యాకవర్గముల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా కలక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆజాద్‌ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భారత దేశానికి మొట్ట మొదటి విద్యాశాఖా మంత్రిగా ఆజాద్‌ విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు కృషి చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పి. అంబేద్కర్‌, ఎపిఎంఐపి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎంఎ. రహీం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఎఒ విఎస్‌ఎన్‌ శర్మ, డిపిఓ జయప్రకాశ్‌, అరకు వేలి మషీద్‌ అధ్యక్షులు గులాం హైదర్‌ ఆలి, పద్మాపురం వార్డ్‌ సభ్యులు పాల్గొన్నారు.