హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేసీఆర్ కుమార్తెను కాపాడేది బిజెపి కాదా?అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే.. వైసిపి, కేసీఆర్, బిజెపి కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. అందుకే మనీశ్ సిసోదియాను జైల్లో పెట్టారని మండిపడ్డారు. అందరూ కలిసి కుమ్మక్కై సిసోదియాను మాత్రమే ఇరికించారన్నారు. సత్యం రామలింగరాజు మీద సెబీ ఎంక్వెయిరీ వేశారని.. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.










