జూన్ 7 నుంచి లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నెట్స్‌లో గాయపడ్డాడు. ప్రాక్టీస్‌లో భాగంగా నెట్ బౌలర్ అనికిత్ చౌదరీ వేసిన బంతి కిషన్ చేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన కిషన్ తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. గాయం కారణంగా జట్టు సెలక్షన్‌కు కిషన్ అందుబాటులో లేకపోతే.. భరత్‌కు చోటు ఖాయమైనట్లే.










