- శ్రీలంక వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు అర్హత సాధించలేపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక జట్టు 198పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో మంగళవారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే టెస్టు సిరీస్ ఓటమితో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశం కోల్పోయిన శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు స్థానాల కోసం టోర్నీకి ముందు అర్హత పోటీ జరగనుంది. అయితే.. వెస్టిండీస్ జట్టు ఎనిమిదో ప్లేస్‌లో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరుజట్లకు 6 పాయింట్ల తేడా మాత్రమే ఉంది.1996లో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన శ్రీలంక.. 2011లో రన్నరప్‌గా నిలిచింది.
టాప్ -8 జట్లు ఇవే..
1. న్యూజిలాండ్ : 165 పాయింట్లు
2. ఇంగ్లండ్ : 155 ,,
3. భారత్ : 139 ,,
4. బంగ్లాదేశ్ : 130 ,,
5. పాకిస్థాన్ : 130 ,,
6. ఆస్ట్రేలియా : 120 ,,
7. అఫ్గనిస్థాన్ : 115 ,,
8. వెస్టిండీస్ : 88 ,,










