Oct 11,2023 16:36

ఖమ్మం: తెలంగాణ తెచ్చుకున్నది దొరలు, దోపిడీదారుల కోసం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలన్నారు. బిజెపికి బీ టీమ్‌గా బిఆర్‌ఎస్‌ పనిచేస్తోంటే అందుకు ఎంఐఎం సహకరిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే.. బిజెపికు ఓటు వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటోందని, తెలంగాణలో భూములను కేసీఆర్‌ అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.