Sep 16,2023 13:30

హైదరాబాద్‌ : సిడబ్ల్యుసి సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. న్యూఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపి రాహుల్‌ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా ముఖ్య నేతలందరికీ రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. రాష్ట్ర వ్యవహారాల ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్‌, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎఐసిసి ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో నేతలకు స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా రెండురోజులపాటు హైదారాబాద్‌లో ఉండనున్నారు. హోటల్‌ తాజ్‌ కృష్ణలో సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య నేతలంతా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న నేపథ్యంలో ... అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.