Apr 01,2023 10:41

మొహాలి : ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఘనంగా ప్రారంభమైంది. నిన్న జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ జెయింట్‌ జట్టు శుభారంభం చేసింది. గుజరాత్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్‌పై తొలి విజయాన్ని అందుకుంది. కాగా నేడు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ తలపడనున్నాయి. ధావన్‌ నాయకత్వంలోని పంజాబ్‌, కొత్త కెప్టెన్‌ నితీష్‌ రాణా ఆధ్వర్యంలో కోల్‌కతా తొలి మ్యాచ్‌ 3.30కు ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌ లఖ్‌నవూలో ఢిల్లీ, లఖ్‌నవూ మధ్య రాత్రి మ్యాచ్‌ జరుగుతుంది. వార్నర్‌ కెప్టెన్సీలో ఢిల్లీ ఆడనుంది. మరోవైపు వరుసగా విఫలమవుతున్న లఖ్‌నవూ సారథి కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో లఖ్‌నవూ బరిలో దిగుతోంది.