హైదరాబాద్ : ఎంజి మోటార్ ఇండియా కొత్తగా తన నెక్ట్స్ జెన్ హెక్టార్‌ను ఆవిష్కరించింది. డ్రైవింగ్ కంపర్ట్, ఇంటీరియర్ ఫీచర్స్ సహా అనేక నూతన టెక్నలాజీలతో దీన్ని రూపొందించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇది అపూర్వమైన చోదక, వినియోగ అనుభవాన్ని అందిస్తుందని ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. 5, 6, 7 సీట్ల సామర్థ్యం వేరియంట్లలో ఇది లభించనుందని తెలిపింది. 2019లో విడుదల చేసిన దీని తొలి మోడల్‌కు ఇప్పటి వరకు విశేష స్పందన లభిస్తుందని ఎంజి మోటార్ ఇండియా ఎండి రాజీవ్ ఛబా పేర్కొన్నారు. నెక్స్ట్-జెన్ హెక్టర్ ఇప్పుడు 100 వాయిస్ కమాండ్‌లతో సహా 75 కన్నా ఎక్కువ అనుసంధానమైన ఫీచర్లను కలిగి ఉందన్నారు. కాగా.. దీని ధరను వెల్లడించలేదు.










