న్యూఢిల్లీ : ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ 'ఇన్‌కొవాక్'ను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్షుఖ్ మాండవీయ, శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విడుదల చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇన్‌కొవాక్ ప్రపంచంలోనే ముక్కు ద్వారా తీసుకునే తొలి కోవిడ్ వ్యాక్సిన్. రెండు విడతలుగానూ, తరువాత బూస్టర్ డోసుగానూ 18 ఏళ్లు దాటిన వారికి ఇవ్వడానికి ఈ వ్యాక్సిన్‌కు 2022 డిసెంబరులో ప్రభుత్వ అనుమతి లభించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించకూడదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఒ) పేర్కొంది. రెండు డోసులుగా ఇచ్చే ఈ వ్యాక్సిన్ మధ్య విరామం 28 రోజులు ఉండాలి. ఈ వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక డోసుకు రూ.800 ధర నిర్ణయించామని భారత్ బయోటెక్ తెలిపింది.ఇప్పటికే రెండు డోసులు, బూస్టర్ డోసు తీసుకున్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వబడదు.










