Jun 19,2023 21:55
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 273ఆలౌట్‌

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌ తొలిటెస్ట్‌ రసకందాయంలో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టు 273పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆస్ట్రేలియా జట్టు 281పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. మరో రోజు ఆట ముగిలి ఉన్న నేపథ్యంలో ఈ టెస్ట్‌ ఫలితం రానుంది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 27పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు 273పరుగులకు కుప్పకూలింది. రూట్‌(46), హెన్రీ(46), స్టోక్స్‌(43) బ్యాటింగ్‌లో రాణించారు. లియాన్‌, కమిన్స్‌కు నాలుగేసి, హేజిల్‌వుడ్‌, బోలండ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8వికెట్ల నష్టానికి 393పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయగా.. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌ 386పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.