Jun 07,2023 16:04

ఓవల్‌ : టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం ఓవల్‌ వేదికగా మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయాలపాన సందర్భంగా టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో కనిపించారు. ఇటీవలే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రైలు ప్రమాదంలో మతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల నల్ల రిబ్బన్లు ధరించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని.. బీసీసీఐ కూడా ఒడిశా ప్రమాద బాధితులకు సహాయం చేసే పనిలో ఉందని పేర్కొన్నాడు.