శ్రీకాకుళం : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ... శనివారం కాకినాడలో జరుగుతున్న కౌన్సెల్ సాధారణ సమావేశంలో టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. చంద్రబాబు నాయుడు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సమావేశం నుండి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సభ్యులు లీలా రాణి, కాళ్ల వేంకట లక్ష్మి, పత్రీ తావిటీ య్యా, కాళ్ల దిలీప్ కుమార్, గేదల శేకర్, నారాయణ బెహరా ఉన్నారు.










