- ఎంపీల బృందంపై రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు
-పలు వాహనాల ధ్వంసం ా అతికష్టం మీద బయటపడ్డ ఎంపీలు
- బిజెపి హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :త్రిపురలో బిజెపి గూండాలు మరోమారు రెచ్చిపోయారు. ఈ దఫా ఏకంగా పార్లమెంటు సభ్యుల బృందంపైనే దాడికి బరితెగించారు. కాన్వారుపై రాళ్ల వర్షం కురిపించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అని నినాదాలు చేస్తూ దాదాపు 30 మంది గూండాలు ఎంపిలు ప్రయాణించిన కారుకు నిప్పు పెట్టారు. పోలీసులు చూస్తుండగానే మరో రెండు కార్లును ధ్వంసం చేశారు. ఎంపిలపైనా దాడికి పాల్పడ్డారు.
త్రిపురలో మార్చి 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వామపక్ష, కాంగ్రెస్ కార్యకర్తలపై బిజెపి పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడింది. ఈ దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సిపిఎం రాజ్యసభ పక్షనేత ఎలమరం కరీం నేతఅత్వంలోని ఏడుగురు ఎంపిలతో కూడిన నిజ నిర్ధారణ బఅందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం నాడు అగర్తలకు చేరుకుంది. బఅందంలో సిపిఎం ఎంపిలు బికాష్ రంజన్ భట్టాచార్య, పిఆర్ నటరాజన్, ఎఎ రహీమ్, సిపిఐ ఎంపి బినోరు విశ్వం, కాంగ్రెస్ ఎంపిలు రంజితా రంజన్, అబ్దుల్ ఖలీక్ ఉన్నారు. వీరంతా మూడు బఅందాలుగా సెపాహిజాల, గోమతి, పశ్చిమ త్రిపుర, ఖోవై, ధలై జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు.
పక్కా ప్రణాళికతో భయోత్పాతం
ఎన్నికల అనంతరం బిజెపి గూండాలు సాగించిన హింసాకాండలో పశ్చిమ త్రిపుర జిల్లా బిషాల్‌గఢ్‌లోని నేహాల్ చంద్రనగర్ మార్కెట్‌లో దాదాపు 20 షాపులు దగ్ధమయ్యాయి. ఈ ప్రాంతాన్ని సిపిఎం ఎంపి ఎలమరం కరీంతో పాటు కాంగ్రెస్ ఎంపి అబ్దుల్ ఖలీఖ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేందర్ చౌదరి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి అజోరు కుమార్, ప్రతప్‌గఢ్ ఎమ్మెల్యే రాముదాస్, పిసిసి అధ్యక్షులు బ్రిజిత్ సిన్హా, ఇతర ఎమ్మెల్యేలు సందర్శించారు. నేతలను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణం సఅష్టించిన బిజెపి గూండాలు ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడ్డారు. మోహన్‌పూర్‌లో సందర్శనకు వెళ్లిన సిపిఎం ఎంపిలు బికాష్ రంజన్ భట్టాచార్య, ఎఎ రహీం, కాంగ్రెస్ ఎంపి రంజితా రంజన్ బఅందం ప్రయాణించే వాహనంపై బిజెపి గూండాలు దాడికి ప్రయత్నించారు. సెక్యూరిటీగా ఉన్న పోలీసులు మౌనం దాల్చారు. దీంతో పోలీసుల వైఖరిపై ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, సిపిఎం ఎంపి పిఆర్ నటరాజన్, సిపిఐ ఎంపి బినరు విశ్వంలతో కూడిన బఅందం పశ్చిమ త్రిపురలోని బర్జాలా, బముతియా నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.
పది రోజుల్లో వెయ్యికి పైగా దాడులు
ఎంపీల బృందం పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పది రోజుల్లోనే బిజెపి గూండాలు వెయ్యికి పైగా దాడులకు పాల్పడ్డారు. వందలాది మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 700 ఇళ్లు కాలిపోయాయి. ధ్వంసమయ్యాయి. వామపక్ష, కాంగ్రెస్ మద్దతుదారులకు చెందిన రబ్బరు తోటలు, ఇతర వ్యవసాయ పంటలను బిజెపి గూండాలు కాల్చివేశారు. వందలాది ఆవులు, గేదులతో పాటు ఇతర పశువులు కాలి బూడిదయ్యాయి. సిపిఎం ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలోకి చొరబడి, ధ్వంసం చేసినా, కాల్చి వేసినా బిజెపి ప్రభుత్వం ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం, పోలీసులు మౌనం దాల్చరని బాధితులు నిజనిర్ధారణ బృందం సభ్యులతో వాపోయారు. బిజెపి ముఠాలు తగులబెట్టిన ఇళ్ల ముందు నేతలతో మాట్లాడుతుండగా పలువురు బాధితులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇన్నాళ్లూ కట్టుకున్న ఇల్లు, పొదుపు చేసుకున్న వనరులు కళ్లముందే బూడిదగా మారాయని బాధితులు గుండెలవిసేలా ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంపి ఎలమరం కరీం బఅందం బిలాస్‌గఢ్ సబ్ డివిజన్‌లోబధార్‌ఘట్, నేహాల్‌చంద్రానగర్ నియోజకవర్గాల్లో చరిపర, గజారియా, కాంపర్‌బజార్‌లలో బాధితులను పరామర్శించింది. ఎంపి బికాష్ రంజన్ భట్టాచార్య బఅందం మోహన్‌పూర్ సబ్ డివిజన్‌లో కల్ కలియా, హరినాఖోలా నియోజకర్గాల్లోనందన్ నగర్, హఅషిపరా, అబోరు నగర్ తదితర ప్రాంతాల్లో బాధితులను కలుసుకున్నారు. ఎంపి పిఆర్ నటరాజన్, బినోరు విశ్వం బఅందం సదర్ సబ్ డివిజన్‌లోని బర్జాలా, నర్సింగ్‌ఘడ్, మోహన్‌పూర్ సబ్ డివిజన్‌లోని బముతియా, దుర్గాబరి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బఅందం దుర్గాబరి, గాంధీగ్రామ్, ఉషాబజార్, కాళికాపూర్, రాంనగర్ వంటి ప్రాంతాలకు చేరుకుని బాధితుల్లో విశ్వాసాన్ని నింపింది.
గవర్నర్‌కు వినతి
దాడులు నేపథ్యంలో ఎంపిల బఅందం శనివారం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. అనంతరం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి వినతిపత్రం సమర్పించింది. సోనార్టరి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బఅందం సభ్యులు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు, కార్యాలయాలపై బిజెపి ఎన్నికల అనంతర హింసాకాండపై తమ ఆందోళన వ్యక్తం చేశామని ఎలమరం కరీం తెలిపారు. ప్రజల జీవితాలను, జీవనోపాధిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హింసాకాండతో ప్రతిపక్ష ఎంపిల బఅందాన్ని తిప్పికొట్టగలమన్నది బిజెపి భ్రమ మాత్రమేనన్నారు. ఈ హింసాకాండను పార్లమెంటులో లేవనెత్తుతామని అన్నారు. నాయకులపై దాడులు చేసి కార్యకర్తల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని సిపిఐ ఎంపి బినోరు విశ్వం అన్నారు.
దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి: సిపిఎం
బిషాల్‌ఘర్‌లోని నేహల్‌చంద్ర నగర్‌లో ప్రతిపక్ష ఎంపిల బఅందంపై బిజెపి చేసిన దారుణమైన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. బిజెపి భయోత్పాత రాజకీయాలు కొనసాగిస్తోందని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బాధితులతో మాట్లాడుతుండగా ఎంపిల వాహనాలు ధ్వంసమయ్యాయంటే అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామ్యక చర్యలను ప్రజలంతా ఖండించాలని ఆయన కోరారు. మరోవైపు ఎంపీల బృందంపై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్ చేసింది. హింస వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
ఎంపిలపై దాడి హేయం : పినరయి విజయన్
త్రిపురలో పర్యటించిన ప్రతిపక్ష ఎంపిల నిజనిర్ధారణ బఅందంపై సంఫ్‌ు పరివార్ గూండాలు చేసిన దాడి హేయమైనదని, ఇది తీవ్రంగా ఖండించదగినదని కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ అన్నారు. ఈ దుర్మార్గపు చర్య వెనుక సంఫ్‌ు పరివార్ గూండాలు ఉన్నారని విమర్శించారు. అక్కడ శాంతిభద్రతలు పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తుందని, త్రిపురలో ఈ భీభత్స పాలనను ఓడించేందుకు ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. ఈ దాడిని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా తీవ్రంగా ఖండించారు. ఎంపిలపై రాళ్లు రువ్వేస్థాయికి బిజెపి బరితెగించిందన్నారు. ఈ హింసాకాండ ద్వారా ఎక్కువకాలం విజయం సాధించలేరని ఆయన పేర్కొన్నారు.










