ప్రజాశక్తి-అమరావతి : ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామ కాల జిఓల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. విసిల నియామక విధివిధానాల జిఓలను సవాలు చేస్తూ పి నర్సింహరావు, మహ్మద్ హఫీజ్ విడివిడిగా వ్యాజ్యాలు వేశారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ ను మూడు వారాలకు వాయిదా వేసింది. వైస్ ఛాన్సలర్ల నియామక నిబంధన లను ప్రభుత్వం అమలు చేయలేదని, యుజిసి నిబంధనలకు వ్యతిరేకంగా చేసిందని పిటిష నర్ల తరపున న్యాయవాదులు వాదించారు.










