డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడిన భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. స్లోఓవర్ రేటు కారణంగా టీమిండియాకు 100 శాతం, ఆసీస్‌కు 80 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత విధించింది.
- గిల్‌కు 15 శాతం జరిమానా
టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు15 శాతం జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల్లోని 2.7 నియమాన్ని గిల్ ఉల్లంఘించినందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్ ఔటైన తీరుపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. కామెరాన్ గ్రీన్ చేతిలోని బంతి నేలను తాకుతున్నట్టుగా కనిపించే ఫొటోను జత పోస్టు చేశాడు. రెండు భూతద్దాలు, తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పెట్టాడు. సాధారణంగా ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు. అంతకమించి బహిరంగంగా విమర్శలు కూడా చేయకూడదు. ఈ క్రమంలోనే గిల్‌కు ఐసీసీ జరిమానా విధించింది.










