ఎడ్జ్‌బాస్టన్ : యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా సంచలన విజయం సాధించింది. అయితే గెలుపు ఆనందంలో ఉన్న ఆసీస్‌కు, ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ జరిమానా విధించింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మేయింటన్ చేసినందుకు ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 40 శాతం కొత విధించింది. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా ఉన్నాయని నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అదే విధంగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. ప్రతీ ఓవర్ లేటుకు వారి డబ్ల్యూటీసీ పాయింట్లలో ఒక పాయింట్ కొత విధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇరు జట్లు చెరో రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు కోల్పోయాయి.










